పండు మిరపకాయలను తరచూ తినడం వల్ల అధిక బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పండు మిరపకాయలు తినేవారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. దీనిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలోని బాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీనిద్వారా మనిషి ఆయుష్షు కూడా పెరుగతుందని వైద్యులు చెప్తున్నారు.