కొన్ని కూరగాయలను ఉడికిస్తే వాటిలోని ఔషధ గుణాలు నశించిపోతాయి. అయితే ఇతరత్రా కూరగాయల తరహాలో పుట్టగొడుగుల్ని ఉడికించినా వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శాతం ఏమాత్రం తగ్గదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ నాడీ వ్యాధుల్ని అడ్డుకుంటుంది.
నరాల వ్యాధులున్న వారు వారానికి మూడుసార్లు పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని ఎర్గోథియోనిన్, గ్లుటాథియాన్ అనే రెండు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్యాన్ని సైతం మీదపడనీయవు.
పుట్టగొడుగుల్లో అత్యధికంగా కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీరాడికల్స్ ఎక్కువ విడుదల కాకుండా చేస్తాయని వైద్యులు తెలియజేశారు. కాబట్టి పుట్టగొడుగులను ఆహారంలో ప్రతిరోజు చేర్చుకోవడం ద్వారా నిత్యయవ్వనులుగా ఆరోగ్యంగా ఉంటారు.