మొక్కజొన్న తినడంపై అపోహలు, వాస్తవాలు

ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (20:58 IST)
మొక్కజొన్న. ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఐతే ఈ మొక్కజొన్న తినడంపై కొన్ని అపోహలున్నాయి. ఆ అపోహలేమిటో, వాస్తవాలేమిటో తెలుసుకుందాము. ప్రతిరోజూ మొక్కజొన్న తినవచ్చా? మొక్కజొన్న ఒక తృణధాన్యం, పోషకమైన ఆహారం. ప్రతిరోజూ మొక్కజొన్న తినడం ప్రయోజనకరంగానే పరిగణించవచ్చు. మొక్కజొన్న తింటే రక్తపోటు పెరుగుతుందా? మొక్కజొన్నలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
 
మొక్కజొన్న-అన్నం వీటిలో ఏది ఉత్తమమైనది? బియ్యం- మొక్కజొన్న రెండూ పోషకాహారాలే కనుక రెండూ తినవచ్చు. మొక్కజొన్న తింటే ఊపిరితిత్తులకు సమస్యా? మొక్కజొన్నను మితంగా తీసుకోవడం ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. ఉడికించిన మొక్కజొన్న ఆమ్లతత్వం వుంటుందా?
ఉడికించిన మొక్కజొన్న ఆమ్లంగా ఉంటుంది. వెన్నతో కలిపితే, అది ఎసిడిటీ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది, గుండెల్లో మంటను కలిగించవచ్చు
 
మొక్కజొన్నను రోజులో ఎప్పుడు తింటే మంచిది?
మొక్కజొన్న రోజులో అల్పాహారం తర్వాత రాత్రి భోజనానికి ముందు ఎపుడైనా తినవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు