బొప్పాయి గింజలు ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లకు మంచి మూలం. అదనంగా, వాటిలో జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఈ బొప్పాయి గింజలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి దోహదపడతాయి.
బొప్పాయి గింజల్లో కార్పైన్ అనే పదార్ధం ఉంటుంది, ఇది ప్రేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది. బొప్పాయి గింజలు మలబద్ధకాన్ని నివారించి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.