జాజి ఆకుల రసాన్ని పగిలిన కాళ్లకు ప్రతి రోజూ పట్టిస్తే, పగుళ్లు మానడంతో పాటు పాదాలు మృదువుగా మారతాయి. జాజి ఆకులను నమిలి మింగుతూ ఉంటే నోటి అల్సర్లకు చెక్ పెట్టవచ్చు. తాజా జాజి పూలను మెత్తగా రుబ్బి, ప్రతి రోజూ ముఖానికి పట్టిస్తే, ముఖం క్రమక్రమంగా కాంతివంతంగా తయారవుతుంది.
జాజి పూల యుక్తంగా కొమ్మలను ముక్కలుగా కత్తిరించి ఆరలీటర్ నీటిలో వేసి, పావులీటరు మిగిలేదాకా కాచి, ఆ తర్వాత వడబోయాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం తయారు చేసుకుని సేవిస్తే, రుతుక్రమం చక్కబడుతుంది. సంతానప్రాప్తి చేకూరుతుంది.
జాజికాయలో కామెర్ల వ్యాధిని తగ్గించే స్వభావం ఉంది. గుండె నొప్పిని తొలగించి బీపీని నియంత్రిస్తుంది. జాజికాయ, శొంఠి అరగదీసి కణతలకు పట్టువేస్తే తలనొప్పి, మైగ్రేన్ వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
మంచి నిద్రకోసం జాజికాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక చెంచా తేనెను చిటికెడు జాజికాయ పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు తాగండి. బాగా నిద్రపడుతుంది. జాజికాయ వీర్యవృద్ధికి తోడ్పడుతుందంట. దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది. అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.