48 రోజులు ఆరెంజ్ జ్యూస్‌లో తేనెను కలుపుకుని తీసుకుంటే?

గురువారం, 31 డిశెంబరు 2020 (14:59 IST)
రోజూ ఆరెంజ్ పండ్లను తీసుకోవడం ద్వారా శరీరంలోని ట్యాక్సిన్లను చెమట ద్వారా, యూరిన్ ద్వారా తొలగించవచ్చు. రోజూ ఆరెంజ్‌ను తీసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే ఆరెంజ్ తొక్కలను ఎండ బెట్టి.. పొడి చేసుకుని సాల్ట్, శొంఠి చేర్చి టూత్ పేస్ట్‌లా ఉపయోగించుకోవచ్చు. తద్వారా దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు. చిగుళ్ల వాపు తగ్గుతుంది. 
 
ఆరెంజ్ జ్యూస్‌ను రోజూ తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. అజీర్తి నయం అవుతుంది. ఆరెంజ్‌ను జ్యూస్‌గా కాకుండా అలాగే తీసుకోవడం ద్వారా పీచును పుష్కలంగా పొందవచ్చు. ఈ పీచు ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే చర్మం, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్లను దూరం చేసుకోవచ్చు. నిద్రలేమితో బాధపడేవారు ఆరెంజ్ జ్యూస్‌తో కాస్త తేనెను కలిపి తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
ఆరెంజ్ జ్యూస్‌ను 48 రోజుల పాటు తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం దృఢంగా మారుతుంది. ఇంకా కిడ్నీ సంబంధిత రోగాలు నయం అవుతాయి. హృద్రోగ వ్యాధులను తొలగించే పొటాషియం, ధాతువులు ఆరెంజ్‌లో వున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు