రోజుకు 8 గంటల కన్నా ఎక్కువ సమయంపాటు నిద్రించే వారిలో డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు వస్తాయని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వైల్లడైంది. అతిగా నిద్రించడం వల్ల బద్ధకం బాగా పెరిగిపోతుంది.
ఎప్పుడూ మబ్బుగా ఉన్నట్లు కనిపిస్తారు. నీరసంగా ఉంటూ, శక్తి లేనట్లు కనిపిస్తారు. అతి నిద్ర వల్ల అధికంగా బరువు పెరుగుతారని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. కనుక అతిగా నిద్రించరాదు. ఒక ప్రణాళిక రూపొందించుకుని నిత్యం 6 నుంచి 8 గంటల పాటు మాత్రమే నిద్రించాలి. దాంతో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు చేకూరుతాయి..!