నొప్పి అనేది సహజం. దీనిని అందరూ అనుభవించి తీరతారు. నొప్పిని అనుభవించని వారుండరు. నిజానికి నొప్పి లేకపోవటమంటే నరాల సంబంధిత రుగ్మతలతో బాధపటుతున్నారని అర్థం. కాబట్టి, వ్యాధుల వలన అలాగే గాయాల వల్ల నొప్పి కలగడం సహజం. కొన్ని రకాల విపరీతమైన నొప్పులు తగ్గేందుకు చాలా సమయం తీసుకుంటాయి.
విరిగిన ఎముక వలన కలిగే నొప్పి లేదా లిగమెంట్ టియర్ వలన కలిగే నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. మరోవైపు, మైగ్రేన్ లేదా బహిష్టు నొప్పి అనేవి ఒక రోజులో తగ్గిపోతాయి. పెయిన్ కిల్లర్స్‌తో పాటు యాంటీ ఇంఫ్లేమేటరీ మెడికేషన్స్ వలన తాత్కాలిక ఉపశమనం కలిగిన వాటి వలన భయంకరమైన ఎఫెక్ట్స్ కలిగే అవకాశాలు ఉన్నాయి.