వేసవిలో పుష్కలంగా లభించే మామిడి పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో వున్నాయి. మామిడిపండులో ఉండే బీటా కెరొటిన్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలూ, ఇన్‌ఫెక్షన్లూ దరిచేరవు. అలాగే కొన్నిరకాల క్యాన్సర్లను మామిడి నిరోధిస్తుంది. మామిడిలో పిండిపదార్థాలు, విటమిన్లు, పొటాషియం పుష్కలం వుంటాయి.
మామిడిలోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి సంబంధ సమస్యల్ని నయం చేస్తాయి. అలాగే కండరాల సామర్థ్యాన్ని పెంచి, శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. మామిడిలో ఉండే విటమిన్-కె ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఎముకల సాంద్రత పెరగడమే కాదు, ఆస్టియోపొరోసిస్ సమస్య రాకుండా కూడా చేస్తుంది.
మామిడి పండులోని విటమిన్-ఎ, సి జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మామిడిని రోజూ నాలుగు ముక్కలు తీసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వృద్ధాప్య ఛాయలను మామిడి తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.