నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే.. ద్రాక్ష రసం సేవించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉరుకు పరుగుల మధ్య జీవనం గడుపుతున్న ప్రస్తుత జనాభాకు అనారోగ్య సమస్యలు వెన్నంటి వస్తుంటాయి. నిద్రలేమి వెన్నంటి వుంటుంది. రాత్రిపూట ద్రాక్ష పండ్లు తింటే హాయిగా నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ద్రాక్షలో నిద్రకు సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. అలాగే ద్రాక్ష పండ్లలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫినోల్స్, ఫ్లెవనాయిడ్స్ అధిక మొత్తంలో ఉన్నాయి. పాలకూరలో అధికంగా ఉండే పోటాషియం, క్యాల్షియం రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తాయి. అంతేకాదు, ప్రతిరోజూ పాలకూర తినే వాళ్లకు ఒత్తిడి, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పి దరిచేరవు. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా నిద్రపోవచ్చు.