మూత్ర పిండాల్లో రాళ్లున్నాయా? బొప్పాయిని తినండి..

బుధవారం, 21 ఆగస్టు 2019 (11:34 IST)
చాలా మందికి బొప్పాయి పండ్లు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువే. బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.


భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట, పేగుల్లో విషపదార్థాల్ని తొలగిస్తుంది. బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయిలో క్యాలరీలు తక్కువే. 
 
అందువల్ల ఎక్కువగా తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు. పైగా ఇది చెడు కొవ్వును తగ్గిస్తుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు. బొప్పాయి రెగ్యులర్‌గా తింటే, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు. అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యల్ని బొప్పాయి తొలగిస్తుంది. 
 
కాన్సర్‌‌పై పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. ఇందులో బీటాకెరోటిన్‌, లూటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్‌ వైరస్‌తో పోరాడతాయి. ఇది కొలన్‌, గర్భాశయ కాన్సర్‌లను తగ్గిస్తుంది. బొప్పాయి అప్పుడప్పుడూ తింటూ ఉంటే కళ్లు చల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు కూడా బొప్పాయి తింటే మంచిదే. నారింజ, యాపిల్‌ కంటే బొప్పాయిలో విటమిన్‌ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది.
 
అందువల్ల మన స్కిన్ సున్నితంగా, మృదువుగా, కోమలంగా మారడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. బొప్పాయి రుచిగా ఉంటుంది కదా అని మరీ ఎక్కువగా తినకూడదు. మితంగా తీసుకుంటేనే పై ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బొప్పాయిని ప్రెగ్నెన్సీ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే బొప్పాయి విపరీతంగా వేడి చేస్తుంది. 
 
అందువల్ల గర్భిణీ మహిళలు బొప్పాయి ఎక్కువగా తింటే ప్రమాదమే. బొప్పాయిని రోజూ తింటే చర్మం కలర్ మారిపోతుంది. కళ్లు తెల్లగా అయిపోతాయి. చేతులు గ్రీన్‌గా మారుతాయి. కామెర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారానికి రెండు మూడుకి మించి బొప్పాయి తినకపోవడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు