కాలం ఎంతో విలువైనది. ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలిసినప్పటికీ పెద్దగా పట్టించుకోరు. సమయం గడిచిపోయిన తర్వాత మాత్రం తెగ బాధపడుతుంటారు. ముఖ్యంగా, అమ్మాయిలు మాత్రం సమయాన్ని వృధా చేయడంలో ముందు వరుసలో ఉంటారు. పైగా, వారు చేసే పనుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. ఒక ఒక యేడాదిలో వారు కేటాయించే సమయాలను లెక్కిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే.
ముఖ్యంగా, అమ్మాయిలు లేదా మహిళలు అందంగా ముస్తాబయ్యేందుకు గంటల కొద్దీ సమయాన్ని వెచ్చిస్తుంటారు. ఇలా ప్రతి రోజూ వెచ్చించే సమయం ఒక యేడాదిలో ఒక వారం రోజుల పాటు ఉంటుందట. అలాగే, డ్రెస్సింగ్ రూమ్‌లో వారు వెచ్చించే సమయం యేడాదికి ఐదు లేదా ఆరో రోజులు ఉంటుందట.
ఇకపోతే, అమ్మాయిలు షాపింగ్‌కు వెళితే ఉదయం నుంచి రాత్రి వరకు చేస్తూనే ఉంటారు. ఇలా ఒక యేడాదితో షాపింగ్ కోసం వారు వెచ్చించే సమయం 200 గంటల నుంచి 250 గంటల వరకు ఉంటుందట. అంటే ఒక వస్తువు కొనుగోలు చేయడానికి కనీసం పది వస్తువులను చూస్తారట.
ఇకపోతే, అమ్మాయిలు డైటింగ్ కోసం యేడాదిలో దాదాపు ఐదు వారాల సమయాన్నికేటాయిస్తారట. ఏది తింటే బరువు పెరిగిపోతామో దేన్లో క్యాలరీలు తక్కువున్నాయో లాంటి లెక్కలు వేసుకుంటూ డైటింగ్ చార్టు ఫాలో కావడానికి ఆమాత్రం టైం తప్పనిసరని అంటున్నారట. ఇలా వారి జీవిత కాలంలో 17 యేళ్ళ సమయాన్ని డైటింగ్ కోసం కేటాయిస్తారట.