అనాసపండును అలా 40 రోజులు తీసుకుంటే? బొజ్జ కరిగిపోతుంది.. తెలుసా? (వీడియో)

శనివారం, 21 సెప్టెంబరు 2019 (12:06 IST)
పైనాపిల్‌లో దాగివున్న ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకుందాం.. విటమిన్ ఏబీసీ ధాతువులు కలిగిన అనాస పండును వరుసగా 40 రోజుల పాటు తీసుకుంటే బొజ్జ తగ్గుతుంది. ముఖ చర్మం మెరిసిపోతుంది. పీచు, ఇనుమును కలిగిన ఈ పండు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అనాసపండులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. హృద్రోగాలను ఇది నయం చేస్తుంది. 
 
ఆస్తమా ద్వారా ఏర్పడే శ్వాస సంబంధిత రుగ్మతలను ఇది తొలగిస్తుంది. కానీ అనాస పండును మితంగా తీసుకోవాలి. పెరుగుతో పాటు అనాస పండును తీసుకోవచ్చు. ఇంకా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇతర కూరగాయలతో కలిపి సలాడ్ రూపంలోనూ డైట్‌లో భాగం చేసుకోవచ్చు. అనాసపండు తేనెతో కలిపి జ్యూస్ రూపంలో 40 రోజుల పాటు తీసుకుంటే.. మైగ్రేన్ తలనొప్పి తొలగిపోతుంది. 
 
ఇంకా కంటి సమస్యలుండవు. చెవిపోటు, దంత సమస్యలు, గొంతు నొప్పిని తగ్గించే గుణం ఫైనాపిల్‌లో పుష్కలంగా వుంది. అనాసపండు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. పచ్చకామెర్లు వున్నవారు అనాస పండు రసాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
 
రక్తహీనతకు కూడా అనాస మెరుగ్గా పనిచేస్తుంది. పిత్త సంబంధిత వ్యాధులను ఇది నయం చేయగలదని.. ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పెయిన్‌కిల్లర్‌గా పనిచేయడంలో పైనాపిల్ ముందుంటుంది. కానీ పైల్స్‌తో ఇబ్బంది పడేవారు, గర్భిణీ మహిళలు అనాసపండును తీసుకోకపోవడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు