అనాస పండును ముక్కలుగా చేసి, తేనెతో కలిపి తింటే శరీరానికి శక్తి మాత్రమే కాదు.. మేని ఛాయ కూడా నిగారింపు కూడా వస్తుంది. రోజూ పైనాపిల్ జ్యూస్ తాగినా, తిన్నా ఉల్లాసంగా ఉంటారు. ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఒక గ్లాసు అనాస జ్యూస్ తాగడం మంచిది.
అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అనాసపండులోని మాంగనీస్ ఎముకలు, దంతాలు, కండరాలు, జుట్టు సమస్యలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.