సోంపు గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. తాజా సోంపు గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉండి, విటమిన్ సీ, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటిలో క్లోరోజెనిక్ యాసిడ్, లైమొనెన్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.