పైనాపిల్ తీసుకోవడం ద్వారా ఆస్తమాను దూరం చేసుకోవచ్చు. పైనాపిల్‌లోని బీటా-కెరోటిన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌నుంచి రక్షిస్తుంది. మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు నుండి రక్షిస్తుంది. దంతాలూ చిగుళ్లూ వంటివి బలంగా ఉండేందుకూ ఇది దోహదపడుతుంది. పుల్లపుల్లగా, తీయతీయగా ఉన్న పైనాపిల్ పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి. అదే విధంగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది.
తల్లిపాలు తగినంతగా లేని చంటి పిల్లలకు బాగా పండిన పైనాపిల్ పండు రసం ఇస్తే చాలా మంచిది. పైనాపిల్ పండు ముక్కల్ని తేనెలో ఇరవై నాలుగు గంటలు ఉంచి తింటే అజీర్తి పోతుంది. పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది.