దానిమ్మ పండులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. అలాగే దానిమ్మ పువ్వులోనూ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే ఔషధాలున్నాయి. దగ్గు, జలుబు, ఆయాసం వంటి రుగ్మతలను తొలగించుకునేందుకు దానిమ్మ పువ్వులు మెరుగ్గా పనిచేస్తాయి. రోజు ఉదయం నాలుగు దానిమ్మ పువ్వులను నమిలి తిని.. ఆపై అర గ్లాసుడు పాలు సేవిస్తే రక్తం శుద్ధి అవుతుంది.
దానిమ్మ పువ్వులను పాలలో ఉడికించి.. ఆ నీటిని వడగట్టి అందులో తేనె కలిపి తీసుకుంటే నరాలకు బలం చేకూరుతుంది. దానిమ్మ పువ్వుల రసం 300 గ్రాములు, ఆవు నెయ్యి 200 గ్రాములు చేర్చి కాచి.. ఆరిన తర్వాత సీసాలో భద్రపరుచుకుని.. ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరానికి బలాన్నిస్తుంది.
దానిమ్మ పువ్వులను సేకరించే నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం, సాయంత్రం పూట ఒక టేబుల్ స్పూన్, తేనెను కలిపి తీసుకుంటే పైల్స్‌కు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.