కాఫీతో సమస్యలు, ఏంటవి?

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (22:08 IST)
ఇదివరకు కాఫీ గింజలను తీసుకుని వాటిని పొడిగా చేసుకుని ఫిల్టర్ కాఫీలా తీసుకునేవారు. ఇపుడంతా రకరకాలుగా కాఫీ పొడి వచ్చేస్తోంది. పాలగ్లాసులో చెంచాడు కాఫీ పొడి వేసుకుని తాగేయవచ్చు. ఈ కాఫీ అధికంగా తీసుకునేవాకి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెపుతున్నారు.
 
కాఫీ రక్తంలో చక్కెర స్థాయిని మార్చవచ్చు. కాబట్టి సాధారణంగా యాంటీ డయాబెటిక్ ఔషధాలతో కాఫీ తీసుకునేటప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయిని పర్యవేక్షించాలని నిపుణులు సలహా ఇస్తారు. ఫిల్టర్ కాఫీ మొత్తం కొలెస్ట్రాల్, తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (ఎల్‌డిఎల్) మరియు ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదలకు దారితీయవచ్చు.
 
కాబట్టి సాధారణంగా ఫిల్టర్ కాఫీని తీసుకోవాలని సలహా ఇస్తారు. గర్భిణీ స్త్రీలకు రోజుకు 2 కప్పులు లేదా అంతకంటే తక్కువ మొత్తంలో కాఫీ సురక్షితం. ఏదేమైనా, ఈ మొత్తానికి మించి తాగడం వల్ల గర్భస్రావం, అకాల పుట్టుక, తక్కువ జనన బరువున్న శిశువు జన్మించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం వుందంటున్నారు. కాబట్టి గర్భధారణ సమయంలో కాఫీ తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు