ముల్లంగిలో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల ముల్లంగిని తింటే మన శరీరానికి పోషణ లభిస్తుంది. హైబీపీ, ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ముల్లంగి తింటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే లివర్‌లో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
ముల్లంగిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.