మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారి సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ సదుపాయం

శుక్రవారం, 29 జనవరి 2021 (17:52 IST)
మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారి సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ సేవలు ప్రారంభమయ్యాయి. 800 మంది సిబ్బందికి ప్రతిరోజూ 100 మంది చొప్పున 8 రోజుల పాటు ఈ సేవలను అందిస్తున్నారు. ఫేస్-1 (మొదటిదశ)ను పూర్తిచేసుకున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రెండవదశలో అనగా 28 రోజుల తర్వాత తీసుకోవాలని తెలియచేసారు.
 
ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ విజయవాడ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, కోవిడ్ వ్యాక్సినేషన్ సేవలను మా స్టాఫ్‌కి అందించడం ఎంతో సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
 
ఈ ప్రమాదకరమైన కోవిడ్‌ను నియంత్రించే క్రమంలో మన దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎంతోమంది పరిశోధకుల కృషి ఉందని, ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించటం ఎంతో సంతోషంగా ఉందని తెల్పారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు