మనం తరచూ వాడే కూరగాయలలో బీరకాయ కూడా ఒకటి. ఇది అధిక ఫైబర్, నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. దీనిలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. బీరకాయకు చలువ చేసే గుణం ఉంది. ఒంట్లోని అధిక వేడిని ఇది తగ్గిస్తుంది. బీరకాయను అనేక రోగాల చికిత్సలో పథ్యంగా కూడా వాడతారు. దీన్ని తింటే చాలా సులభంగా జీర్ణమవుతుంది.
బీరకాయలో మన శరీరానికి కావలసిన విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియంలు ఉన్నాయి. జ్వరం వచ్చిన వెంటనే లేత బీర పొట్టు వేపుడు పెడితే చాలా మంచిది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.