సగ్గుబియ్యమే కదాని తీసిపారేయకండి.. ఇలా వాడితే ఒబిసిటీ..?

బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (18:16 IST)
అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే తీసుకునే ఆహారంలో సగ్గుబియ్యం చేర్చండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే..? సగ్గుబియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. బరువు తగ్గాలని అనుకొనే వారు తరచుగా వాడితే ఖ‌చ్చితంగా శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు.
 
పెద్దవారికి, బరువు తగ్గాలనుకునే వారికే కాదు ఈ సగ్గుబియ్యం పసిపిల్లలు, చిన్నపిల్లలకి కూడా అమృతం వంటిదే. సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అయ్యే ఆహారం కాబట్టి పాల త‌ర్వాత‌ చిన్న పిల్లలకి తినే ఆహార పదార్థంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు.
 
పోషకాల శాతం ఎక్కువగా ఉండి, ఎటువంటి ఇతరేతర కృత్రిమ పదార్థాలు క‌లువ‌క‌పోవడం ఇంకా కలిసొచ్చే విషయం. సాధారణంగా మ‌న‌కు సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి తీసుకోవడం తెలిసిందే. అలానే కాదు, నీటితో ఉడికించిన‌ తర్వాత చక్కెర అందులో కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. కాబట్టి డైట్‌లో తరచుగా సగ్గు బియ్యాన్ని చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు