అప్పడాలు.. కరకరమంటూ సైడ్ డిష్ గా తింటుంటే ఆ రుచి వేరు. నిజానికి ఒకప్పుడు ప్రతి భారతీయ ఇంటి వాకిట్లోనో లేదంటే భవనంపైనో ఈ అప్పడాలను చేసి ఎండబెట్టుకుంటూ వుండేవారు. ఐతే ఎప్పుడైతే సూపర్ మార్కెట్లు వచ్చాయో సహజసిద్ధమైన అప్పడాలు కూడా మాయమయ్యాయి. నూనెలో వేయగానే పొంగుతూ వచ్చే ఆ అప్పడాలు తింటే ఆరోగ్యం అప్పడమైపోతుందంటున్నారు వైద్యులు.
గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధులు మరియు అధిక బిపి ఉన్నవారికి అప్పడాల వల్ల అధిక సోడియం శరీరంలోకి చేరుతుంది. స్టోర్లో కొన్న పాపడ్‌లు తరచుగా కృత్రిమ రుచులు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడతాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఓవర్‌డ్రైవ్‌లో ఆమ్లతకు కారణమవుతాయి.