గర్భిణీ మహిళలైతే సాయంత్రం రాత్రి పూట అధికంగా నీరు లేదా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం ద్వారా రాత్రి పూట బాత్రూమ్‌ల వెంట నడిచే పని తప్పుతుంది. దీంతో నిద్రకు భంగం కలుగదు. అయితే మితంగా నీటిని తీసుకోవాలి. పగటి పూట ఎక్కువ నీటిని తీసుకోవాలి. ఇక రాత్రిపూట లోదుస్తులను తొలగించి నైటీలతో నిద్రించడం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు.
బిగుతుగా వుండే దుస్తులను ధరించడం ద్వారా చర్మ సమస్యలు తప్పవని అందుకే వాటిని తొలగించి నిద్రించడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చెమట ద్వారా బ్యాక్టీరియాలు చర్మాన్ని కమలిపోయేలా చేస్తాయని.. తద్వారా దురద వంటి ఇతరత్రా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు స్నానం చేసి.. తడి లేకుండా మాయిశ్చరైజర్ క్రీములను చర్మానికి వాడటం మంచిదని వారు చెప్తున్నారు.