వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

ఠాగూర్

మంగళవారం, 15 జులై 2025 (11:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపాకు ఉన్న ఎన్నికల గుర్తును మార్చాలంటూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ కోరారు. ఈ మేరకు ఆయన భారత ఎన్నికల సంఘానికి ఓ లేఖ కూడా రాశారు. పార్టీకి గుర్తు మార్చాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని, అందువల్ల వీలైనంత త్వరగా ఎన్నికల గుర్తును మార్చాలని ఆయన విన్నవించారు. 
 
ప్రస్తుతం తమ పార్టీకి ఫ్యాన్ గుర్తు ఉందని, పలు అంతర్గత సంప్రదింపులు అనంతరం తమ పార్టీ చిహ్నాన్ని గొడ్డలి గుర్తుగా మార్చాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని ఆ లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ చిహ్నాన్ని గొడ్డలిగా గుర్తుగా మార్చాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని  ఆ లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ భవిష్యత్, గుర్తింపు, రాజకీయ వ్యూహం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 
1968 ఎన్నికల ఆర్డర్ ప్రకారం సంబంధిత నియమాలు, విధానాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా గొడ్డలిని తమ పార్టీ చిహ్నంగా కేటాయించాలని కోరుతున్నానని శివకుమార్ తన లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాలు, డాక్యుమెంట్లు, అఫిడవిట్లు లేఖకు జతచేశామని తెలిపారు. మీ సానుకూల పరిశీలన కోసం తాను ఎదురు చూస్తున్నామని తెలిపారు. మరోవైపు ఈసీకి శివకుమార్ రాసిన లేఖ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కాగా, వైకాపా ఫౌండర్‌ శివకుమార్ కాగా, ఆయన నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని సొంతం చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు