నూడుల్స్ అంటే చాలా మందికి ఇష్టమే. ఈ నూడుల్స్‌ను ఏకంగా ఇండ్లలోనే తయారు చేసుకుని మరీ తింటున్నారు. అయితే ఎలా తిన్నా, ఏ నూడుల్స్ తిన్నా అవి ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు వైద్యులు. మరి ఈ నూడుల్స్ వలన ఎలాంటి నష్టాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం.
నూడుల్స్‌లో మోనోసోడియం గ్లూటమేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి అధిక మోతాదులో చేరితే దాని ఫలితంగా బీపీ, తలనొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. నూడుల్స్‌లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువలన శరీరంలో అధికంగా నీరు చేరేందుకు కారణమవుతుంది. తద్వారా పాదాలు, చేతులు ఉబ్బినట్లవుతాయి.