పన్నీర్‌ను ఉడికించేటప్పుడు వాటిల్లో కొద్దిగా ఉప్పును కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చపాతీలు మృదువుగా రావాలంటే పిండిని కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా మెుక్కజొన్న పిండి, పాలు కలుపుకుంటే చాలు. నూడుల్స్ విరివిగా రావాలంటే వాటిని చల్లని నీటితో వేసుకుంటే మంచిది. ఉల్లిపాయలు కట్ చేసే ముందుగా వాటిని నీళ్ళల్లో కాసేపు ఉంచుకోవాలి. ఇలా చేస్తే కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు రావు.