ఇంకా ఆర్వో వాటర్‌లో క్యాల్షియం, మెగ్నీషియం స్థాయులు తగ్గడంతో హృద్రోగ సంబంధిత వ్యాధులు తప్పవు. నరాల ఇబ్బందులు, ప్రెగ్నెన్సీ ఇబ్బందులు, క్యాన్సర్ కారకాలు ఏర్పడే అవకాశం వుందని వైద్యులు చెప్తున్నారు. ఒకవేళ ఆర్వో ఫ్యూరిఫైయర్స్ వాడే పనైతే మినరలైజర్ ఆర్ టీడీఎస్ కంట్రోలర్ / మోడ్యులేటర్ ఫీచర్‌తో వున్నది కొనడం మంచిది.
ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్వో నీటిని సేవించాల్సి వస్తే.. మెగ్నీషియం పుష్కలంగా వుండే ఆకుకూరలు, ఆవకోడో, అరటి పండ్లు, రాస్‌బెర్రీ, నట్స్ అండ్ విత్తనాలు, కూరగాయలు (బ్రొకోలీ, క్యాబేజీ, గ్రీన్ బీన్స్), సాల్మన్, తునా చేపలు తీసుకోవాలి.
అలాగే బ్రౌన్ రైస్ ఓట్స్, డార్క్ చాక్లెట్ ఆహారంలో చేర్చుకోవడాన్ని అస్సలు మరిచిపోకూడదు. అలాగే క్యాల్షియంతో కూడిన ఆహారాన్ని కూడా డైట్‌లో భాగం చేసుకోవాలి. పాలు, చీజ్, ఆల్మండ్స్ తీసుకోవాలని న్యూట్రీషియన్లు చెప్తున్నారు.