తల కింద దిండు పెట్టుకోకుండా పడుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

మంగళవారం, 19 మార్చి 2019 (20:19 IST)
మనలో చాలామంది నిద్రించేటప్పుడు తలకింద దిండు పెట్టుకునే అలవాటు ఉంటుంది. దిండు లేకుండా అస్సలు చాలామంది నిద్రించలేరు. ఇక మరికొందరైతే దిండు లేకపోతే తమకు మెడ నొప్పి వస్తుందని, అసౌకర్యంగా ఉంటుందని చెబుతారు. అయితే నిజానికి ఎవరైనా కూడా తలకింద దిండు లేకుండా నిద్రిస్తే మంచిదట. దీంతో పలు ఆరోగ్యమైన ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
 
తలకింద దిండు లేకుండా నిద్రిస్తే ముఖంపై ఉన్న ముడతలు, మచ్చలు పోతాయి. దిండు పైన పడుకున్నప్పుడు దిండుకు ఉన్న బ్యాక్టీరియా మన ముఖానికి అతుక్కుని ముడతలు ఏర్పడుతాయి. కాబట్టి దిండు లేకుండా నిద్రిస్తే బ్యాక్టీరియా చేరే అవకాశం ఉండదు. దీంతో మచ్చలు, ముడతలు రావట. తరచూ వెన్నునొప్పి ఉన్న వారు తలకింద దిండు లేకుండా చేసుకుంటే మంచిదట. దీంతో వెన్నెముకకు విశ్రాంతి లభిస్తుంది. అది తన సహజసిద్థమైన షేప్‌లోకి వస్తుందట. ఈ క్రమంలో వెన్నెనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు.
 
దిండు లేకుండా నిద్రిస్తేనే నిద్ర చాలా బాగా పడుతుందట. దిండు లేకుండా నిద్రించడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరమవుతాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. మానసిక ఆందోళన తొలగుతుందట. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట. మెడ, భుజాల నొప్పులు తగ్గుతాయట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు