రెడ్ స్ట్రాబెర్రీస్... తింటే ఏమిటి?

గురువారం, 14 సెప్టెంబరు 2017 (19:16 IST)
స్ట్రాబెర్రీ చూడగానే నోరూరుతుంది. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవేనన్నది వైద్యులు మాట. బెర్రీ పండ్లలో పీచు పదార్థం మెండుగా వుంటుంది. అలాగే వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. దీని ఫలితంగా వయసు పైబడినట్లు కనిపించదు. మార్కెట్‌లో కనిపించే ఎర్రెర్రటి బెర్రీలను తింటే యాంటీ ఆక్సిడెంట్‌ శరీరంలో చేరి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. 
 
స్ట్రాబెర్రీ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు వ్యాధినిరోధ శక్తిని పెంచుతుంది. చర్మాన్ని పొడిబారనివ్వకుండా చేసే స్ట్రాబెర్రీల్లో పీచుపదార్థాలెక్కువ. యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్టాబెర్రీస్‌ను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, మాగ్నీషియం, అయోడిన్, ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలున్నాయి. తద్వారా డయాబెటిస్, క్యాన్సర్‌ను నిరోధించే శక్తి స్టాబ్రెర్రీస్‌కు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఈ పండ్లు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెపోటును నివారిస్తుంది. క్యాన్సర్‌ను నిరోధించడంతో పాటు రక్తకణాలను సైతం ఈ ఫ్రూట్స్ ఉత్పత్తి చేస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు