వేరుశెనగలు వేయించి కాదు.. నీటిలో ఉడికించి తినండి..

గురువారం, 14 సెప్టెంబరు 2017 (09:25 IST)
వేరుశెనగలను పచ్చిగా కాకుండా.. నీటిలో ఉడికించి తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఉడికించిన వేరుశనగలను తీసుకుంటే అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హృద్రోగ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. మధుమేహ వ్యాధి నుంచి ఉపశమనాన్నిస్తుంది. వేయించిన వేరుశెనగల కంటే.. ఉడికించిన వేరుశెనగల్లో తక్కువ కెలోరీలు వుంటాయి. ఫలితంగా ఒబిసిటీకి దూరంగా వుండొచ్చు. 
 
అలాగే వేరుశెనగ నూనెను ఉపయోగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నూనెలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, మోనోసాకరైడ్‌లతో పాటు విటమిన్ ఏ, డీ, ఈ పుష్కలంగా వుంటాయి. వేరుశనగ నూనె కణాలను సంరక్షించే గుణాలను కలిగివుంటుంది. శరీరంలోని కొవ్వు పదార్థాల సాయిలను తగ్గిస్తుంది.
 
మొటిమలను తగ్గించటానికి వేరుశనగ నూనెను వాడితే మంచి ఫలితం వుంటుంది. రెండు స్పూన్లు వేరుశెనగ నూనెను తీసుకుని, అరస్పూన్ నిమ్మరసాన్ని కలిపి రోజూ చర్మానికి అప్లై చేస్తే.. మొటిమలు దూరమవుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి స్థాయిలు పెరగటానికి గానూ వేరుశనగ నూనెను వాడాలి. ఈ నూనె శరీర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు