ఇకపోతే చెరకు రసం జీవక్రియ రేటు మెరుగుపడేలా తోడ్పడుతుంది. అధిక బరువుని అదుపులో ఉంచాలనుకునేవారు చెరకు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. చెరకులో ఇనుముతో పాటు ఫోలేట్ శాతం కూడా ఎక్కువే ఉంటుంది. హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. గర్భిణులు చెరకు రసాన్ని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువులోని లోపాలను అరికట్టవచ్చు. వేసవిలో చెరకు రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండలో అలసిపోయి తిరిగి వచ్చాక ఒక గ్లాసు చెరకు రసాన్ని తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.
చెరకు రసంలో జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లూ, ప్రొటీన్‌లు వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. తరచూ తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా చెరకు రసం వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది.