చెరకు రసంతో వారానికి ఒకసారి ఫేషియల్ చేసుకుంటే..?

శనివారం, 3 నవంబరు 2018 (14:50 IST)
చెరుకులో పొటాషియం పుష్కలంగా వుంటుంది. ఇవి జీర్ణ సమస్యలను నివారిస్తుంది. చెరుకు రసాన్ని తరుచుగా తీసుకోవడం వలన కడుపులో ఏర్పడే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. చెరుకు రసాన్ని తాగడం వల్ల అలసటను దూరం చేసి శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి తరుచుగా వచ్చే జ్వరాలను నివారిస్తుంది. 
 
అలాగే చెరకు రసం ముఖానికి రాసుకుంటే అలిసిపోయిన చర్మానికి తిరిగి శక్తిని అందిస్తుంది. చర్మంలో సమతూకం ఉండేలా చూస్తుంది. మొహం మీద గీతలు, ముడతలు పడకుండా చేస్తుంది. మృతకణజాలాన్ని నశింపచేసి కొత్త కణజాలం తొందరగా రావడానికి సహాయపడుతుంది. 
 
చెరకు రసాన్ని మొహానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే మీ ముఖం కోమలంగా ఉంటుంది. అంతేకాదు.. మొహం మీద మచ్చలు, మొటిమలు మాయమై కాంతివంతంగా తయారవుతుంది.
 
పిగ్మెంటేషన్ వల్లఏర్పడిన మచ్చలను తొలగించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. చెరకు రసంతో వారానికి ఒకసారి ఫేషియల్ చేసుకోవడంతో పాటు రాత్రి పూట పడుకోబోయే ముందు నైట్‌క్రీములు, క్లెన్సింగ్ మిల్క్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు