రాత్రిపూట పిల్లలకు టీ, కాఫీలు ఇస్తున్నారా?

సోమవారం, 8 జనవరి 2018 (15:53 IST)
రాత్రిపూట చదువుకునే పిల్లలకు టీ, కాఫీలు ఇస్తున్నారా? ఇక మానేయండి. టీ, కాఫీలు పిల్లలకు ఇవ్వడం కంటే.. వేడి వేడి పాలను ఇవ్వడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

లేకుంటే వేడి వేడి పాలలో బాదం పొడిని కలిపి పిల్లలకు ఇవ్వడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. టీ, కాఫీలు ఇవ్వకుండా పాలను మాత్రమే పిల్లలకు ఇవ్వడం ద్వారా ప్రోటీన్లు, క్యాల్షియం పొందవచ్చు.  
 
అలాగే పిల్లలకు ఇచ్చే అల్పాహారంలో ఉడికించిన కోడిగుడ్డును మరిచిపోకూడదు. ఉడికించిన కోడిగుడ్డులో జ్ఞాపకశక్తికి దోహదం చేసే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. చదువుకునే పిల్లలకు పగటిపూట తాజా పండ్ల రసాలను ఇవ్వడం చేయాలి. 
 
పరీక్షా సమయంలో ఎక్కువ మోతాదులో ఉప్పు, పంచదార, మసాలాలు ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వకూడదు. ఆహారంలో మాంసాహారం కంటే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. 
 
పుచ్చకాయ, గుమ్మడికాయ గింజలను పిల్లలకు ఇచ్చే స్నాక్స్‌లో కలిపి ఇవ్వడం ద్వారా వారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు