టీ త్రాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియ బాగుంటుంది.
మెదడులో రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేస్తుంది. మెదడుకు చురుకుదనం కలిగిస్తుంది.
టీలో అల్లం ముక్కను చితక్కొట్టివేసి ఆ టీని త్రాగితే అరుచిని పోగొడుతుంది. అజీర్ణ సమస్యలను పోగొడుతుంది. గరం మసాలా టీ త్రాగితే జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. గొంతు గరగర నుంచి కాపాడుతుంది. అయితే మితంగా తాగడమే మంచిది.