నెలసరి సమయంలో చిప్స్, కేక్స్, కూల్‍డ్రింక్స్ తీసుకుంటే?

సోమవారం, 2 జులై 2018 (11:14 IST)
మహిళలు నెలసరి సమయంలో పోషకాహారం తీసుకోవాలి. నెలసరి సమయంలో తీసుకునే పోషకాలతో కూడిన ఆహారం గర్భసంచిని ఆరోగ్యంగా వుంచుతుంది. తద్వారా యూట్రస్ సంబంధిత రుగ్మతల నుంచి దూరంగా వుండవచ్చునని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. 
 
నెలసరి సమయంలో ఇనుము అధికంగా వుండే ఆహార పదార్థాలు, విటమిన్లు వున్నవి తీసుకోవడం ఉత్తమం. అయితే వైట్ బ్రెడ్, పాస్తా, ప్యాక్ చేసిన ఆలు చిప్స్, కేక్ వంటివి నెలసరి సమయంలో తీసుకోకూడదు. కొవ్వుతో కూడిన పదార్థాలు, నూనెలో వేపిన పదార్థాలను నెలసరి సమయంలో తీసుకోకపోవడం మంచిది. పిజ్జా, బర్గర్లు పక్కనబెట్టేయడం శ్రేయస్కరం.
 
వీటితో పాటు ఫాస్ట్‌ఫుడ్స్, కొవ్వుతో కూడిన మాంసాహారం, చీజ్, ఫ్యాట్ మిల్క్‌ను తీసుకోకూడదు. ఉప్పు కూడా కాస్త తగ్గించుకుంటే మంచిది. స్వీట్స్, సోడా, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఆల్కహాల్‌ను నెలసరి సమయంలో పక్కనబెట్టేయడం ద్వారా అలసటను, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు