ఇందులోభాగంగా, ఆ బాలికను వివిధ ప్రాంతాలకు తిప్పుతూ పలువురితో అత్యాచారం చేయించారు. అలా నాలుగు రోజుల పాటు బాలికను ఇలాగే చిత్రహింసలకు గురిచేశారు. చివరకు వారి చెర నుంచి తప్పించుకున్న ఆ బాలిక.. ఈనెల 24వ తేదీన లుథియానాలోని తన తల్లికి ఫోన్ చేసి చెప్పటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... బాలికను రక్షించారు. ఈ దారుణంపై బాలిక తల్లి మాట్లాడుతూ.. ఒక యేడాది క్రితం తాము సంగ్రూర్‌లోనే ఉండేవాళ్లం. అప్పుడే నాకు సోనాతో పరిచయం ఏర్పడింది. వేసవి సెలవులు కావడంతో నా కూతురు 15 రోజుల క్రితం సోనా వాళ్ల ఇంటికి వెళ్లింది. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. పైగా నాపై సోనా బెదిరింపులకు దిగడాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్టు, ఈ విషయంలో తన కుమార్తెకు న్యాయం జరిగేంత వరకు సోనాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.