సాధారణంగా వేసవి కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మసాలా ఆహారం, అధిక శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్ వంటి చల్లని పదార్థాలను ఆరగించడం వల్ల శరీరం వేడిబారినపడకుండా ఉంటుంది. అలాగే, సీజనల్ పండ్లను అధికంగా సేవించారు. జ్యూస్‌లు, మంచినీళ్లు సేవిస్తూ ఉండాలి.
అదేవిధంగా, వేసవిలో రారాజు మామిడికాయనే. వీటిలో ఏ, సీ విటమిన్స్ ఉంటాయి. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటిలో ఐరన్, కాల్షియం ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించటంతో పాటు ఎముకలు గట్టిగా ఉంటాయి.
వేసవిలో మోసంబి పండు తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకుపోతాయి. విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధకశక్తిని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ పుష్కలం ఈ పండులో కాబట్టి వడదెబ్బ తగిలిన వారికి ఉపశమనం లభిస్తుంది.