టొమాటో దాదాపు ప్రతి వంటకంలోనూ ఉపయోగిస్తారు. ఐరోపాలో దాదాపు 200 సంవత్సరాలుగా ప్రజలు టొమాటోలను విషపూరితంగా భావించారని మీకు తెలుసా. అసలు టొమాటోలకు ప్రపంచంలో ఎలాంటి పేరు వుందో తెలుసుకుందాము. 1800ల మధ్యకాలం వరకు యూరప్, అమెరికా దేశాల్లో టొమాటో విషపూరితమైనదిగా భావించబడింది. పాశ్చాత్య దేశాల్లోని ప్రజలు 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు టమోటాలను తినడానికి భయపడి దూరంగా ఉండేవారు.
టొమాటోలు విషపూరితమైనవిగా పరిగణించబడ్డాయి, ఎందుకంటే దాని మొక్కలో విషపూరిత ఆల్కలాయిడ్ టొమాటిన్ ఉంటుంది. యూరోపియన్ కోర్టులు టమోటాకు 'పాయిజన్ యాపిల్' అని ముద్దుగా పేరు పెట్టాయి. 1820లో, కల్నల్ రాబర్ట్ గిబ్బన్ జాన్సన్ న్యూజెర్సీ కోర్టులో టమోటాలు విషపూరితం అనే నమ్మకాన్ని కొట్టిపారేశాడు.