ఈ 5 ఆరోగ్య సమస్యలున్నవారు బాదం పప్పు తినకూడదు

బుధవారం, 28 జూన్ 2023 (23:05 IST)
బాదం పప్పులు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని నానబెట్టి తింటుంటే శరీరానికి శక్తి వస్తుంది. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలు వున్నవారు వీటిని తినరాదు. అలాంటి సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. అధిక రక్త పోటు వున్నవారు బాదం పప్పులు తినకూడదు. కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు కూడా బాదం పప్పులను మోతాదుకి మించి తినరాదు.
 
జీర్ణ సమస్యలుంటే బాదం పప్పులకి దూరంగా వుండాలని నిపుణులు చెపుతారు. ఇప్పటికే అధిక బరువుతో ఇబ్బందిపడేవారు బాదం పప్పులకు దూరంగా వుండాలి. ఎసిడిటీ సమస్యతో వున్నవారు కూడా బాదములను తినకపోవడం మంచిది. పార్కిన్సన్స్ అనారోగ్య సమస్యతో బాధపడేవారు కూడా బాదములు తినకూడదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు