వట్టివేర్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వేర్లలో ఇనుము, మాంగనీస్, విటమిన్-బి6 పుష్కలంగా ఉంటాయి. వట్టివేర్లు జ్వర తీవ్రతను తగ్గిస్తుంది. హృద్రోగులకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవాళ్లకు మంచిది. కళ్ల మంటలను నియంత్రిస్తుంది. చెమటకాయలని అడ్డుకుంటాయి. వట్టి వేర్లు చలువ చేస్తాయి. మండే ఎండల్లో ఎన్నోరకాలుగా ఉపశమనం అందిస్తాయి. వేసవి కాలంలో వట్టివేర్లను నీటిలో వేసుకుని ఆ నీటిని సేవించడం ద్వారా శరీర వేడిని దూరం చేస్తాయి.