పుచ్చకాయలతో వేసవి తాపానికి చెక్...

సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:28 IST)
వేసవికాలంలో ఎక్కువగా దొరికే ఫ్రూట్స్‌లో పుచ్చకాయ ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా వేసవిలో వీటిని ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వేసవి తాపం తీర్చుకోవడానికి ఈ పండు ఎంతగానో సహకరిస్తుందనడంలో సందేహం లేదు. అయితే అలాగే తినడం ఇష్టం లేనివారు దీనితో వివిధ వంటలు చేసుకుని ఆస్వాదించవచ్చు.
 
గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు, అవసరమైతే కాస్త చక్కెర లేదా పెప్పర్, చిటికెడ్ ఉప్పు, కొన్ని ఐస్ క్యూబ్స్ మిక్సీలో వేసి, జ్యూస్ తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయ గుజ్జులో కాస్త ఐస్‌క్రీం, కొన్ని పాలు వేసుకుంటే అచ్చం షాప్‌లలో దొరికే మిల్క్‌షేక్ ఇంట్లోనే తయారు అవుతుంది. 
 
వీటితో పాటు పిల్లలు బాగా ఇష్టపడే మరో పుచ్చకాయ వంటకం ఏంటంటే...పుచ్చకాయ ముక్కలలో గింజలు తీసివేసి, బ్లెండర్‌లో గ్రైండ్ చేయండి, ఆ తర్వాత అందులో మిల్క్‌మెయిడ్ కండెన్స్‌డ్ మిల్క్ వేసి మరోసారి బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి, ఫ్రీజర్‌లో పెట్టవచ్చు లేదా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని వెంటనే తినేయచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు