గరం మసాలా టీ త్రాగితే జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. గొంతు గరగర నుంచి కాపాడుతుంది. అయితే మితంగా తాగడమే మంచిది. లవంగం, శొంఠి, ఏలకులు, దాల్చిన చెక్కను పౌడర్‌లా చేసి టీ అరస్పూన్ వేసుకుంటే జలుబు తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. దాల్చిన చెక్కలో బరువు తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయి.
టీ త్రాగడం వల్ల ఆ ఆకులో వున్న పోషక విలువలు శరీరానికి లభ్యమవుతాయి. తేయాకులో కార్బోహైడ్రేట్, ఖనిజాలు లభిస్తాయి. విటమిన్ ఎ,బి,సి,ఇ,కె కూడా ఉంటాయి. కాపర్, ఐరన్,జింక్, మాంగనీస్ టీలో లభిస్తాయి. అందుచేత రోజుకు 2, 3 కప్పుల టీని త్రాగితే శరీరానికి ఎలాంటి హాని జరగదు.
* మెదడులో రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేస్తుంది. మెదడుకు చురుకుదనం కలిగిస్తుంది.
* మెదడును ఉత్తేజపరుస్తుంది.