సన్నగా వుండాలనుకుంటే.. రోజుకో ఆపిల్ తినండి..

బుధవారం, 1 నవంబరు 2017 (09:16 IST)
సన్నగా వుండాలనుకుంటున్నారా..? బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజుకో ఆపిల్ తీసుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఆపిల్‌లో కరిగే ఫైబర్‌ అధిక మొత్తంలో కలిగి వుండటం ద్వారా జీర్ణవ్యవ్యస్థను ఆరోగ్యకరస్థాయిలో ఉంచుతుంది. అలాగే శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తొలగించి బరువు పెరగకుండా చూస్తుంది. ఫైబర్, విటమిన్, మినరల్‌లను కలిగి వుంటుంది. 
 
అలాగే అల్పాహారంలో కోడిగుడ్డు వుండేలా చూసుకోవాలి. కోడిగుడ్లలో ప్రోటీన్‌లు కలిగివుంటాయి. కోడిగుడ్డు అల్పాహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి తక్కువ కెలోరీలు అందుతాయి. ప్రోటీన్‌లను అధికంగా కలిగి ఉండే గుడ్లను అల్పాహారంగా తినటం వలన ఎక్కువ సమయం ఆకలిగా అనిపించదు. 
 
వీటితో పాటు తాజా పండ్లు, పచ్చి కూరగాయలు తీసుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు. కూరగాయలు, పండ్లలో తక్కువ కొవ్వు పదార్థాలుంటాయి. ఇవి తక్కువ కెలోరీలను అందిస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు