టమోటాను ప్రతి వంటలోను సహజంగా వాడుతుంటారు. టమోటాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె జబ్బులు, రక్తపోటు, డయేరియాను నిరోధించేందుకు టమోటా చక్కగా ఉపయోగపడుతుందట. గాయాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుందట. లివర్ చక్కగా పనిచేయడానికి తోడ్పడుతుందట. టమోటాలను బాగా తినేవారిలో ప్రొస్టేట్, రెక్టల్, పాంక్రియాటిక్, బ్రెస్టు, సెర్వికల్, కేన్సర్ల బెడద ఉండదట.
అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను 10-15శాతం తగ్గిస్తుందట. డయేరియాకు టమోటో సూప్ అద్భుతంగా పనిచేస్తుందట. టమోటాలో ఉండే విటమిన్ సి, ఫ్లెలినాయిడ్సు రక్తనాళాలను బలోపేతం చేస్తాయట. గుండెపోటు, డయాబెటిస్ రిస్క్ టమోటాలు తగ్గిస్తాయట.
ఎండవల్ల కమిలిన చర్మానికి మజ్జిగలో నానబెట్టిన టమోటో ముక్కలు పేస్టులా రాస్తే ఫలితం ఉంటుందట. పుండ్లు, గాయాలకు టమోటా గుజ్జు ఉంచి బ్యాండేజీ కడితే బాగా పనిచేస్తుందట. రోజుకు రెండుమార్లు బ్యాండేజీ మార్చాలట. ఎప్పుడూ నీరసంగా నలతగా ఉంటే టమోటో జ్యూసు మంచి టానిక్ లా పనిచేస్తుందట. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందట.