పంచలోహ విగ్రహాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (21:12 IST)
పంచలోహ విగ్రహాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌కి చెందిన దేవేంద్ర, జాన్, అష్రఫ్, ప్రేమ్ చంద్ గుప్త అనే నలుగురు ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలుసులు అదుపులోనికి తీసుకున్నారు.
 
నాగమణి రాయి, దుర్గామాత విగ్రహాలను కొనుగోలు చేసి పూజ చేస్తే కోట్లు సంపాదిస్తారని ప్రజలను నమ్మించి, ఈ రెండు విగ్రహాలని కోటి రూపాయలకు అమ్మకానికి పెట్టారు.
 
టాస్క్ ఫోర్స్ పోలీసులుకు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. కాకినాడలో అమ్మవారి విగ్రహం తయారు చేయించి హైదరాబాదులో అమ్మకానికి పెట్టారు ఈ ముఠా సభ్యులు. 30 కిలోల అమ్మవారు విగ్రహంతో పాటు నాగమణి రాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు