వయసు 40 ఏళ్లు దాటిందా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

గురువారం, 9 మే 2019 (19:21 IST)
40 ఏళ్లు దాటాయా? అయితే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వయసులోనే మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటివి ఇబ్బందిపెట్టే అవకాశాలు ఎక్కువ. 
 
కనుక 40 ప్లస్‌ వయసు తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో కొన్ని పద్ధతులను పాటించాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొలెస్ట్రాల్, చక్కెర పాళ్లు తక్కువగా ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం. ఆహారంలో కూరగాయలు, ధాన్యాలు, తాజా పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నూనె పదార్థాలను చాలామటుకు తగ్గించాలి.
 
ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు