అదిలేనప్పుడు... టోస్ట్ చేసిన గోధుమ బ్రెడ్ తిన్నా, స్మూతీస్ తీసుకున్నా బాగానే ఉంటుంది. పెరుగు బాగా గిలకొట్టి పండ్ల ముక్కల్లో వేయాలి. పైన కాస్త తేనె చేర్చాలి. దీన్ని తింటే అరుగుదల బాగుంటుంది. వ్యాయామం సమయంలో జీర్ణాశయం శుభ్రపడుతుంది. మధ్య మధ్యలో నీళ్లూ తాగుతుండాలి. వ్యాయామం పూర్తయ్యాక కాసేపు రిలాక్స్ కావాలి. ఆ తర్వాత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. వీలుంటే కొబ్బరినీళ్లకు ప్రాధాన్యం ఇవ్వండి.
జాగింగ్, రన్నింగ్ చేసేవారు ఓట్‌మీల్ తీసుకుంటే కావల్సిన శక్తి అందుతుంది. త్వరగా అలసి పోవడం జరగదు. దీన్ని జావ, ఉప్మా ఎలాగైనా తీసుకోవచ్చు. అలానే మార్కెట్లో మల్టీగ్రెయిన్ బ్రెడ్ అందుబాటులో ఉంది. దీని మీద తేనె రాసి తిన్నా మంచిదే.
వ్యాయామం తర్వాత... కండరాలకు విశ్రాంతి అవసరం. అలాంటప్పుడు శరీరానికి అమినో ఆమ్లాలు అందితే కండరాలు ఉత్తేజితమవుతాయి. గుడ్డులో ఈ ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. ఉడికించిన గుడ్ల మీద మిరియాల పొడి చల్లుకుని తింటే మంచిది. యాపిల్, బాదం, తృణ ధాన్యాలూ, పెరుగు తీసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు శారీరక ఒత్తిడిని దూరం చేస్తాయి. పిస్తా పప్పులో పోటాషియం ఉంటుంది. ఇది శరీరం దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.