లావెండర్ ఆయిల్ అందానికే కాదు... ఆరోగ్యానికి కూడా...

సోమవారం, 8 ఏప్రియల్ 2019 (21:12 IST)
లావెండర్ ఘాటైన రుచిని కలిగి ఉండటం వలన తక్కువ మొత్తంలో మాత్రమే ఆహారాలలో కలపాలి. అయితే దీనిని షాంపూ, నూనెల మరియు లోషన్ తయారీలలో కూడా వాడతారు. కానీ, ఉత్తమ భాగాలన్నిటిని, వైద్య పరంగా మరియు ఇతర ఔషధాల తయారీలలో వాడతారు. లావెండర్ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఔషదంలా పని చేస్తుంది. ముఖ్యంగా చుండ్రు సమస్యను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.
 
1. తలలో ఏర్పడే చుండ్రు చాలా రకాలుగా సమస్యలతో పాటుగా మరియు నలుగురిలో తిరగటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ, లావెండర్ నూనెను వాడటం వలన చుండ్రు నుండి ఉపశమనం పొందవచ్చు.
 
2. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను మరియు పునరుత్పత్తి లక్షణాలను కలిగి ఉండే లావెండర్ ఫంగస్ మరియు ఈస్ట్‌ల వ్యాప్తి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ జుట్టును వేడి నీటితో కడిగి, శుభ్రమైన టవల్ ద్వారా ఎండబెట్టండి. ఇపుడు 15 చుక్కల లావెండర్ ఆయిల్‌ను, 2 చెంచాల ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెలో కలిపి, 10 నిమిషాల పాటూ, వేడి చేయాలి. ఈ నూనెతో తలపై మసాజ్ చేసి, షవర్ క్యాప్‌తో కప్పండి. ఇలా ఒక గంట సమయం పాటూ వేచి ఉండి, గాఢత తక్కువగా ఉన్న షాంపూ ద్వారా కడిగి వేయండి. మంచి ఫలితాలను పొందుటకు గానూ, వారానికి ఒకసారి ఈ పద్దతిని అనుసరించండి.
 
3. లావెండర్ ఆయిల్, జీర్ణాశయ సమస్యలు మరియు కడుపులో ఉబ్బరం వంటి సమస్యలను మాత్రమేకాకుండా, పేగులలో ఆహార కదలికలను కూడా చైతన్యవంతపరుస్తుంది. అంతేకాకుండా, ఈ నూనెలు జీర్ణాశయ వ్యవస్థలో జఠర రసాలు మరియు పైత్య రసం ఉత్పత్తిని పెంచి, అజీర్ణం, కడుపులో నొప్పి, వాంతులు మరియు విరేచనాల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 
4. లావెండర్ నూనెలు వివిధ రకాల నొప్పులను తగ్గించే ఔషదంగా పని చేస్తాయి. ఉదాహరణకు కండరాల నొప్పులు, కీళ్ళవాతం, బెణుకులు మరియు వెన్నునొప్పిల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా, లావెండర్ నూనెలతో రోజు మసాజ్ చేయటం వలన కీళ్ళ నొప్పుల నుండి కూడా ఉపశమనం పొందుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు