కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే.. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే.. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం అంటున్నారు.. వైద్యులు. తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని వారు చెప్తున్నారు. ధాన్యాలలో మినరల్స్, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రెడ్‌బ్లడ్ సెల్స్‌కు బాగా సహాయ పడుతుంది.
ఈ రెడ్ బ్లడ్ సెల్స్ గుండెకు, కండరాలకు ఆక్సిజన్ చేరవేడయడంలో సహాయకారిగా ఉండి శరీరానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది. ఇందులో కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడే అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పాటు మాంసకృత్తులు సమద్ధిగా ఉన్నాయి.
అలాగే ఓట్ మీల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా సహాయ పడుతుంది. శరీరం, జీవనచర్యకు ఉపయోగపడే శక్తిని ఇస్తుంది. ఇక రోజుకు ఓ కోడిగుడ్డు తీసుకోవాలి. సాల్మన్ ఫిష్‌ను తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. కరోనా వేళ వారంలో నాలుగు సార్లు సాల్మన్ ఫిష్‌ను తీసుకోవాలి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
అలాగే డార్క్ చాక్లెట్ శరీరంలో ఇన్ఫమేషన్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక ఫ్లేవనాయిడ్ కంటెంట్స్ బ్లడ్ సర్కులేషన్‌కు బాగా సహాయపడుతాయి. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. పెరుగును తీసుకోవడం ద్వారా మాంసకృత్తులు లభిస్తాయి. క్యాల్షియం లభిస్తుంది. వీటితో పాటు అరటిపండు, స్వీట్ పొటాటో, పుట్టగొడుగులు, అనాస పండు ముక్కలను రోజూ వారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.